SKLM: జిల్లా రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. జిల్లా మీదగా అమృత్ భారత్ కొత్త ట్రైన్‌ను నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. బ్రహ్మపూర్- ఉద్నా- బ్రహ్మపూర్(19021/22) మీదగా అమృత్ భారత్ రైలును ఈనెల 27వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నట్లు పేర్కొంది. దీనికి సంబంధించి టికెట్ బుకింగ్స్ ఈనెల 26 నుంచి ప్రారంభంకానున్నాయి.