NLG: ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గురువారం ఆమె మునుగోడు తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా భూ భారతి దరఖాస్తులు, భూములకు సంబంధించిన సమస్యలు, దరఖాస్తుల పరిష్కారం, తదితర వివరాలను తహసీల్దార్ నరేష్ ద్వారా అడిగి తెలుసుకున్నారు.