మేడ్చల్: ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని మల్లాపూర్ డివిజన్లో భూగర్భ డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రూ.16.5 లక్షలతో భూగర్భ డ్రైనేజీ పనులను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ సహకరిస్తానన్నారు.