ATP: కుందుర్పి మండలం జంబుగుంపల గ్రామంలో గురువారం ఏవో విజయ్ కుమార్ రైతులకు యూరియా పంపిణీ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీపై అందిస్తున్న ఈ ఎరువులను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులకు యూరియా కొరత లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.