E.G: ఇండియా స్కిల్స్ కాంపిటీషన్–2025లో తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఆసక్తి గల విద్యార్థులు, యువతీ, యువకులు తప్పనిసరిగా ఈ నెల 30లోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి మురళి తెలిపారు. ఈ సందర్భంగా ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ పోటీలు యువతలోని సృజనాత్మకత, నైపుణ్యం, ఆవిష్కరణ శక్తిని వెలికితీసే వేదికగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.