VSP: జీఎస్టీ సంస్కరణలపై వినియోగదారులకు అవగాహన కల్పించాలని జేసీ కె.మయూర్ అశోక్ సూచించారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుబజార్లు, రేషన్ షాపులు, ఆర్టీసీ, ఏపీఈపీడీసీఎల్, హోటళ్లు మొదలైన రంగాలపై సమీక్షించారు. చట్టాల ఉల్లంఘనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.