KRNL: ఈవీఎంలను భద్రపరిచిన గోదాము వద్ద నిరంతరం పటిష్టమైన నిఘా ఉండాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. ఎన్నికల సంఘం ఆదేశాలు, మార్గదర్శకాల మేరకు త్రైమాసిక తనిఖీలో భాగంగా కలెక్టరేట్లో ఉన్న ఈవీఎం గోడౌన్ను గురువారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ తనిఖీ చేశారు. EVM యంత్రాలు, అక్కడి భద్రతా చర్యలను పర్యవేక్షించారు.