WGL: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రధాన కార్యాలయంలో గురువారం మహిళ బ్యాంకు ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు, డీసీసీబీ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు మాట్లాడుతూ.. పూలతో దేవుళ్ళను పూజించే ఈ దేశంలో పూలనే దేవుళ్ళుగా భావించి తెలంగాణ ఆడపడుచులు నిర్వహించుకునే గొప్ప పండుగ బతుకమ్మ పండుగ అని పేర్కొన్నారు.