AP: మెగా డీఎస్సీ విజేతలకు సచివాలయం సమీపంలో నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 15,941 మంది విజేతలకు నియామక పత్రాలు అందజేశారు. అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పారు. ఈ ఏడాది నవంబర్లో టెట్ పరీక్ష నిర్వహిస్తామని, అలాగే వచ్చే ఏడాది మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు.