‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ సిరీస్ విషయంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ అధికారి సమీర్ వాంఖడేకు చుక్కెదురైంది. ఈ సిరీస్లో తనని తప్పుగా చూపించారని, తన పరువుకు భంగం కలిగించినందుకు షారుఖ్, రెడ్ చిల్లీ ఎంటర్టైన్మెంట్ రూ.2 కోట్లు చెల్లించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను స్వీకరించేందుకు కోర్టు నిరాకరించింది.