TG: రాష్ట్రంలోని ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. ఆలేరు నియోజకవర్గానికి చెందిన 148 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. రేవంత్ ప్రత్యేక ప్రణాళికలతో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. మాజీ సీఎం KCR మాత్రం ఇష్టానుసారంగా అప్పులు చేసి.. వాటిని తన కుటుంబానికి ధారాదత్తం చేశారని ధ్వజమెత్తారు.