‘కాంతార 1’ సినిమాలోని ఓ సీన్ ‘కాంతార’ క్లైమాక్స్ కంటే శక్తివంతంగా ఉంటుందని హీరో రిషబ్ శెట్టి తెలిపారు. ఈ సీన్ అన్ని భాషల ప్రేక్షకులకు జీవితాంతం గుర్తుంటుందని, ప్రేరణగా నిలుస్తుందని అన్నారు. ఈ సినిమాలో దేవుడికి సంబంధించిన సన్నివేశాలు చేసేటప్పుడు నియమాలు పాటించానని, మాంసాహారం తినలేదు.. చెప్పులు వేసుకోలేదని తెలిపారు.