ELR: దెందులూరు మండలం సీతంపేట రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడు సుమారు ఐదు అడుగుల ఎత్తు, గుండ్రటి ముఖం కలిగి ఉన్నాడని రైల్వే పోలీసులు తెలిపారు. 40 నుంచి 45 సంవత్సరాల వయస్సు ఉంటుందన్నారు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.