SRCL: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ అని, సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గితే అన్నారు. పోలీస్ కార్యాలయంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకులు ఘనంగా నిర్వహించారు. చాకలి ఐలమ్మ చిత్రపటానికి ఎస్పీ మహేష్ పి గీతే పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.