MNCL: ఏఎన్ఎంలపై అధికారుల వేధింపులు ఆపాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం మంచిర్యాలలో జరిగిన యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. రెండవ ఏఎన్ఎంలకు పరీక్ష నిర్వహించి ఏడాది గడిచినా నేటికి ఫలితాలు ఇవ్వకుండా, రెగ్యులరైజేషన్ చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు.