MBNR: జిల్లాలోని హోం గార్డులకు ఎస్పీ జానకి ఇవాళ రేయిన్ కోట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజా భద్రత కోసం వర్షం, ఎండ, పండగలు అనేవి లేకుండా అవిశ్రాంతంగా సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. వారి ఆరోగ్యం, సంక్షేమం కోసం ప్రాధాన్యత ఇస్తామన్నారు. అలాగే, ప్రజల భద్రతకు పోలీసు శాఖ కట్టుబడి పని చేస్తుందని వెల్లడించారు.