VSP: పదోన్నతి పొందిన 12 మంది పోలీస్ సిబ్బందిని గురువారం విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రాత బాగ్చి సత్కరించి, వారికి నూతన ర్యాంకులు, పోస్టింగ్ ఆర్డర్లను అందజేశారు. వీరిలో 7 మంది కానిస్టేబుళ్లు హెడ్ కానిస్టేబుళ్లుగా, 5 గురు హెడ్ కానిస్టేబుళ్లు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు (ఏఎస్ఐ)గా పదోన్నతి పొందారు. 113 పోలీస్ సిబ్బందికి రివార్డులు అందించారు.