VZM: వార్షిక తనిఖీల్లో భాగంగా విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జట్టి విజయనగరంలో ఉన్న పలు పోలీసు స్టేషన్లలో గురువారం తనిఖీలు నిర్వహించారు. ఆయా పోలీసు స్టేషన్ల రికార్డులు, సి.డి ఫైల్స్‌ను పరిశీలించారు. ముందుగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, మహిళ డీఎస్పీ స్వాగతం పలికి పూల మొక్కను అందజేశారు. ఆనంతరం సిబ్బంది నుండి గౌరవం వందనం స్వీకరించారు.