NLG: మునుగోడులో గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని BRS మండల అధ్యక్షుడు మందుల సత్యం డిమాండ్ చేశారు. గురువారం BRS నాయకుల ఆధ్వర్యంలో ఎస్సై రవికి వినతి పత్రం అందజేశారు. ఈ చర్య మూర్ఖత్వం అని విమర్శించిన ఆయన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని కోరారు.