JGL: మహిళలు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మల్యాల వైద్యాధికారి మౌనిక సూచించారు. మల్యాల పీహెచ్సీలో స్వస్థ్నారి స్వశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం నేడు విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా వివిధ వైద్య విభాగాల్లో 316 మందికి వైద్య సేవలు అందించారు. ఈ వైద్య శిబిరానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని పేర్కొన్నారు.