JGL: విశ్వకర్మలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కంచె ఐలయ్య, యావత్ విశ్వకర్మలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని భారత్ సురక్ష సమితి డిమాండ్ చేసింది. నిన్న జగిత్యాలలో సమావేశంలో బీఎస్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. గతంలోనూ ఆయన హిందువులను కించపరిచేలా మాట్లాడారని, వెంటనే కంచె ఐలయ్యను అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. బీఎస్ఎస్ నాయకులు ఎసీఎస్ రాజు, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.