AP: కర్నూలు జిల్లాలో టమాటా ధర మరింత పతనమైంది. పత్తికొండ, ప్యాపిలి మార్కెట్లలో కిలో టమాటా రూ.2కి పడిపోయింది. దిగుబడితో మార్కెట్లు కిటకిటలాడుతుండగా.. ధరలు మాత్రం అమాంతం పడిపోతున్నాయి. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస గిట్టుబాటు ధరను కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.