NLG: జిల్లా కేంద్రంలోని హజరత్ సయ్యద్ షా లతీఫ్ ఉల్లా ఖాద్రి ఉర్సు ఉత్సవాలు, అక్టోబర్ 9 నుంచి ప్రారంభం కానున్నట్లు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఉర్సు కమిటీ, ఇనాంధార్ ముతవలీల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.