నిర్మాత జెమినీ కిరణ్‌ని బాలకృష్ణను కలిసి మాట్లాడమని చెప్పానని చిరంజీవి వెల్లడించారు. మూడుసార్లు ప్రయత్నించినా కలవలేకపోయారని చెప్పారు. తాను, నారాయణమూర్తి సహా మరికొందరు జగన్‌ను కలిసి సినీ పరిశ్రమ సమస్యలను వివరించామని అన్నారు. పరిశ్రమకు సహకరించాలని కోరామని, దీనికి ఆ సమావేశంలో ఉన్నవారంతా సాక్షులే అని చిరంజీవి పేర్కొన్నారు.