ఆసియా కప్ సూపర్-4లో భాగంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ జకీర్ అలీ బౌలింగ్ ఎంచుకున్నాడు. కాగా, ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు చేరుతుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. దీంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది.