KNR: చిగురుమామిడి చిన్న ముల్కనూరు మోడల్ స్కూల్ ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని సీహెచ్. శ్రీనిధి రాష్ట్రస్థాయి ఎసీఎఫ్ తైక్వాండో పోటీలకు ఎంపికైంది. జగిత్యాలలో జరిగిన జిల్లా తైక్వాండో సెలక్షన్లో అండర్-19 విభాగంలో ఆమె ప్రతిభ కనబరిచింది. కోచ్ బుర్ర మానస ప్రవీణ్ కుమార్ ఈ విషయాన్ని తెలియజేశారు. KNR రూరల్ సీఐ విజయ్ కుమార్ శ్రీనిధిని, కోచ్‌ను అభినందించారు.