NZB: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి రిజర్వేషన్ల వివరాలను తెలియజేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి గురువారం ఆయన వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం అందించిన వారిలో నాయకులు పోతన్కర్ లక్ష్మీనారాయణ, యాదల నరేశ్, నారాయణ తదితరులున్నారు.