ADB: తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 130వ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని మాజీమంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. ఈనెల 26న నిర్వహించే జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని రజక సంఘం సభ్యులు మాజీ మంత్రి జోగు రామన్నను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. గత BRS ప్రభుత్వ హాయంలోనే చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు.