ఏ దేశమైనా వేగంగా అభివృద్ధి చెందాలంటే విద్యుత్ ఉత్పత్తిని పెంచడం అవసరమని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్తు ప్రాధాన్యాన్ని విస్తరించిందని ఆరోపించారు. కాలుష్యరహిత విద్యుత్ ప్రచారాన్ని బీజేపీ సర్కారు ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తోందని వెల్లడించారు. క్లీన్ ఎనర్జీ ఉత్పత్తిలో ముందంజలో ఉన్నవే విజయవంతమైన దేశాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు.