BDK: భద్రాచలం పట్టణంలోని సబ్ కలెక్టర్ మృణాళ్ శ్రేష్ఠ గ్రంథాలయాన్ని తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వరరావుతో కలిసి గురువారం సందర్శించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు ఏకాగ్రత, క్రమశిక్షణతో చదివితే విజయం సొంతం చేసుకోవచ్చని సూచించారు. పోటీ పరీక్షలు పూర్తయ్యే వరకు క్రీడలు, సినిమా వినోదాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు వివరించారు.