BHPL: మండలం గొర్లవీడు గ్రామంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైశ్య కమ్యూనిటీ హాల్లో ఘనంగా జరుగుతున్నాయి. గురువారమైన నాల్గవ రోజు కాత్యాయని అవతారంలో అమ్మవారి దర్శనం ఇచ్చారు. కమిటీ సభ్యులు రోజుకొక అవతారంలో అమ్మవారిని అలంకరించి, ఇష్టమైన నైవేద్యాలు సమర్పిస్తూ భక్తులకు అన్నప్రసాదం అందిస్తున్నారు.