ELR: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల ఆర్అండ్ఆర్ పనులకు సంబందించిన భూ సేకరణ పనులు వేగవంతం చేయాలనీ కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుండి గురువారం పోలవరం ప్రాజెక్టు ఆర్అండ్ఆర్ భూ సేకరణ పై అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భూసేకరణ కోసం భూమిని గుర్తించిన తర్వాత ఆయా గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించాలన్నారు.