JGL: ఈరోజు ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం పురస్కరించుకొని డాక్టర్ వీఆర్కే కాలేజ్ ఆఫ్ ఫార్మసీ విద్యార్థులు, ఉపాధ్యాయులు “ఆరోగ్య సంరక్షణలో ఫార్మసిస్టుల పాత్ర” అనే అంశంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. జగిత్యాల పాత బస్స్టాండ్ నుంచి కొత్త బస్స్టాండ్ వరకు జరిగిన ఈ ర్యాలీలో జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీనీ ప్రారంభించారు.