PDPL: దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నాలుగవ రోజు కాత్యాయని అమ్మవారికి భక్తులు గురువారం విశేష పూజలు నిర్వహించారు. రామగుండం, గోదావరిఖని పరిసర ప్రాంతాలలో కొలువైన దుర్గాదేవి అమ్మవార్ల సన్నిధిలో మాల ధారణ భక్తులు భక్తి పారవశ్యంతో పూజలు చేశారు. దీంతో కోల్ బెల్టు పారిశ్రామిక ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.