ఖమ్మంలోని వినాయక నగర్, రైల్వే కాలనీ రోడ్డు ప్రాంతాల్లో గురువారం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు కమిషనర్‌ను కలిసి వీధిలైట్ల సమస్యను తెలియజేశారు. రాత్రి వేళల్లో వీధిలైట్లు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు స్పందించిన కమిషనర్ వీధిలైట్ల పనులను యుద్ధ ప్రతిపాదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు.