TPT: హైదరాబాద్కు చెందిన హోప్ ఫౌండేషన్ ఛైర్మన్ కొండ విజయ్ కుమార్ గురువారం శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ మేరకు ఆయన సుమారు 6 కిలోల బంగారం ధరించి స్వామివారిని దర్శించుకోవడం విశేషం. కాగా, స్వామివారి దర్శనం పొందిన అనంతరం ఆలయం వెలుపల భక్తులు ఆయనను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు.