అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి స్పందించారు. అప్పటి సీఎం జగన్ ఆహ్వానం మేరకే ఆయన నివాసానికి వెళ్లానని స్పష్టం చేశారు. ‘నన్ను జగన్ సాదరంగా ఆహ్వానించారు. సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని జగన్కు వివరించా. పది మందిని వస్తానని చెప్తే జగన్ సరేనన్నారు. బాలకృష్ణకు ఫోన్ చేస్తే అందుబాటులోకి రాలేదు’ అని చిరు తెలిపారు.