AP: తన చొరవ వల్లే ఏపీలో టికెట్ రేట్లు పెంచేందుకు అప్పటి జగన్ ప్రభుత్వం ఓకే చెప్పిందని చిరంజీవి అన్నారు. ‘నా చొరవ వల్లే అప్పట్లో నీ వీరసింహారెడ్డి, నా వాల్తేరు వీరయ్య టికెట్లు పెరిగాయి. ప్రభుత్వ నిర్ణయం వల్ల సినీ పరిశ్రమకు మేలు జరిగింది. CM అయినా, సామాన్యుడైనా నా సహజ ధోరణిలోనే గౌరవం ఇస్తా. బాలకృష్ణ అసెంబ్లీలో తనపై వ్యంగ్యంగా మాట్లాడటం వల్లే వివరణ ఇస్తున్నా’ అని తెలిపారు.