AP: ప్రముఖ ఎకనామిక్స్ ప్రొఫెసర్ డీ.ఎల్. నారాయణ తన రాజకీయ జీవితానికి పునాది వేశారని సీఎం చంద్రబాబు అన్నారు. ఆయనే తనను రాజకీయాల్లోకి రావడానికి ప్రోత్సహించారని, యూనివర్సిటీ క్యాంపస్ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేశానని తెలిపారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన రెండేళ్లలోనే మంత్రి అయ్యానని చెప్పారు. మనల్ని ప్రోత్సహించేవారు ఉంటే ఆకాశమే హద్దుగా ఉంటుందని పేర్కొన్నారు.