VZM: మన ఊరును బాగుచేసుకుందాం అని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని కలెక్టరేట్లో గురువారం ప్రారంభించారు. ముందుగా మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం 12 మంది మున్సిపల్ పారిశుధ్య కార్మికులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య పాల్గొన్నారు.