KMM: పేదల ఆరోగ్యానికి రేవంత్ సర్కారు పెద్దపీట వేస్తుందని కూసుమంచి మంత్రి పొంగులేటి క్యాంప్ ఆఫీస్ ఇంఛార్జ్ భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం కూసుమంచి మండలానికి చెందిన 92 మందికి రూ.29,73,500 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను క్యాంప్ ఆఫీస్ ఇంఛార్జ్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.