VSP: లంచం తీసుకుంటూ ఇద్దరు రెవెన్యూ శాఖ అధికారులు ఏసీబీకి చిక్కారు. గురువారం మధ్యాహ్నం ములగడ ఎమ్మార్వో కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్, సర్వేయర్ కలిసి రూ. 30వేలును బాధితుల నుంచి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వీరిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.