NLG: నల్గొండ శివారు మర్రిగూడ బైపాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పట్టణం నుంచి చర్లపల్లి వైపు వెళ్తున్న టిప్పర్ ఒక్కసారిగా నెమ్మదిగా వెళ్లడంతో దానిని వెనుక నుంచి వస్తున్న బైక్ ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావం జరిగింది. వెంటనే 108లో అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.