ADB: బ్రాండెడ్ బియ్యం పేరుతో పీడీఎస్ బియ్యం అమ్ముతూ ప్రజలను మోసం చేస్తున్న నిందితుడు షేక్ అయూబ్ అరెస్టు చేసినట్లు వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ గురువారం తెలిపారు. నిందితుని వద్దనుండి ఒక ఆటో, 6 క్వింటాళ్ల రాయితీ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితుడిపై ఇదివరకే కేసులు నమోదు అయి ఉన్నందున దుకాణం జప్తు కొరకు ఆర్డీవోకు సిఫార్సు చేశామన్నారు.