ప్రకాశం: ఒంగోలులో నీటి కుంటల్లో నీరు నిల్వ ఉందని, పిల్లలు వాటి వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు సూచించారు. ఈ మేరకు ఈత సరదా కోసం చిన్నారులు వెళ్లి తల్లిదండ్రులకు ఇబ్బందులు కలిగించవద్దని ఆయన కోరారు. కాగా, జోరు వర్షాల కారణంగా నీటి కుంటల్లో నీరు చేరిందని, దీనిని గమనించి అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.