MBNR: ప్రజలందరూ సుఖసంతోషాలతో బతుకమ్మ పండుగను జరుపుకోవాలని మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు డి కె అరుణ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బాలుర కళాశాల మైదానంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలకు ఎంపీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దంగా బతుకమ్మ వేడుకలు నిలుస్తాయని వెల్లడించారు.