సుంకాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో బాంబు పేల్చారు. అప్‌హోస్టర్డ్ ఫర్నీచర్‌పై 30 శాతం, భారీ ట్రక్కులపై 25 శాతం దిగుమతి సుంకాలు విధిస్తామని వెల్లడించారు. బ్రాండెడ్ డ్రగ్స్‌పై ఏకంగా 100 శాతం విధిస్తామని స్పష్టం చేశారు. అమెరికా తయారీ ప్లాంట్ ఉన్న కంపెనీలకు వర్తించదని పేర్కొన్నారు. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి తీసుకొస్తామన్నారు.