TG: పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా టికెట్ రేట్ల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు తెలియకుండానే OG సినిమాకు సంబంధించి టికెట్ రేట్ల పెంపు జరిగిందన్నారు. ఏపీలో ఈ సినిమాకు జీవో ఇచ్చారు కాబట్టి, ఇక్కడ కూడా ఇచ్చారని అనుకుంటున్నట్లు తెలిపారు. ఇకపై చిన్న, పెద్ద ఏ సినిమాలైనా ఒక్కటే టికెట్ రేటు అమలు చేస్తామని ప్రకటించారు.