AKP: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయాలకు వేతనాలు పెంచాలని అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. వీరికి వేతనాలు సక్రమంగా అందడం లేదన్నారు. ప్రతి నెల వేతనాలు అందే విధంగా చూడాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖలో 24 ఏళ్ల నుంచి పనిచేస్తున్న సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు పదోన్నతులు కల్పించాలన్నారు.