KDP: నగరంలోని పలు ఆలయాల్లో దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రాజరాజేశ్వరి ఆలయంలో శుక్రవారం అమ్మవారు మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని ప్రత్యేకంగా పూలు, గాజులతో అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.